Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2015 10:50:45
facebook Twitter Googleplus
Photo

'గబ్బర్ సింగ్ 2' సినిమా షూటింగ్ ఈ రోజున 'పూణె'లో మొదలైనట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఈ మధ్యకాలంలో గెడ్డం పెంచుకుని కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఆయన గెడ్డంతో కనిపిస్తాడట. ఆ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలను ముందుగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా 'అనీషా అంబ్రోస్'ని ఎంపిక చేశారు. 2012 లో గబ్బర్ సింగ్ వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఎప్పుడూ కూడా ఆలస్యానికి ఏవేవో కారణాలు వినిపిస్తూ వచ్చాయి. అసలు ఈ సీక్వెల్ వస్తుందా .. రాదా అని డీలాపడిపోయిన పవన్ అభిమానులకి, ఈ సినిమా షూటింగ్ మొదలైందనే శుభవార్తకన్నా కావలసినదేవుంటుంది?

,  ,  ,  ,  ,  ,  ,