Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2016 13:41:22
facebook Twitter Googleplus
Photo

అప్పుడెప్పుడు దశావతారం కోసం కమల్ హాసన్ పది గెటప్పుల్లో కనిపిస్తేనే అబ్బా..అనుకున్నాం ఇప్పుడు ఒకే హీరో ఒకే చిత్రం లో 47 గెటప్పులో కనిపిస్తే ఇంకెలా ఉండబోతుంది చెప్పండి..వింటినే ఒకలా అనిపిస్తూ..అది వెండి తెరఫై చూస్తే ఇంకెలా ఉంటుందో చెప్పండి.

ఆవారా , ఊపిరి వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన కార్తీ తన తాజా చిత్రం కాష్మోరా చిత్రం లో ఏకంగా 47 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు..గెటప్ అంటే డ్రెస్ మార్చడం అనుకునేరు ఆలా ఏమి కాదు లుక్‌ కూడా వేరుగా ఉంటుందట. ఈ సినిమాలో ఇన్ని గెటప్పులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక మీరే చూస్తారుగా అనే సమాధానం చెపుతున్నాడు.

ఈ చిత్రం కోసం ఎన్నో నెలలు కష్టపడడ్డానని , ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉందని చెపుతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది. పివిపి ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల తో నిర్మించాడు. తెలుగు , తమిళ భాషలలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

,  ,  ,  ,  ,  ,