Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:49:22
facebook Twitter Googleplus
Photo

చేతిలో గన్ను పట్టుకుని యాక్షన్ తో పాటు కామెడీ చేసిన గబ్బర్ సింగ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ వెంటనే ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు షికారు చేశాయి. అప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలించి, గబ్బర్ సింగ్ మళ్లీ రెడీ అవుతున్నాడు. పవన్ కల్యాణ్ తన పాత్ర పట్ల పూర్తి స్పష్టతతో .. అందుకు తగిన గెటప్ తో రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమా పాటలు బాగా రావడం కోసం చెన్నైలో దేవిశ్రీప్రసాద్ కసరత్తు చేస్తున్నాడు.
ఇక గుజరాత్ లో జరుపవలసిన షూటింగ్ విషయంగా, దర్శకుడు బాబి .. తన కెమెరామేన్ జైనన్ విన్సెంట్ .. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి గుజరాత్ వెళ్లాడు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది. అందువలన అందుకు సంబంధించిన పనులు మరింత వేగాన్ని పుంజుకున్నాయని తెలుస్తోంది. గతంలో యాక్షన్ .. కామెడీ .. లవ్ .. సెంటిమెంట్ ..సూపర్ హిట్ సాంగ్స్ వంటి ఆయుధాలతో గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డును నెలకొల్పాడు. దాంతో గబ్బర్ సింగ్ 2 కోసం ఆడియన్స్ ఆసక్తిగా .. ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,