Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 15:27:42
facebook Twitter Googleplus
Photo

13 ఏళ్ల పాటు కమల్ హాసన్ తో సహజీవనం చేసి.. ఈ మధ్యే ఆయన్నుంచి విడిపోయింది గౌతమి. వీళ్లిద్దరూ కలిసి జీవనం మొదలుపెట్టినపుడు ఎవరికీ ఏమీ సమాచారం ఇవ్వలేదు కానీ.. విడిపోయినపుడు మాత్రం గౌతమి పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. కమల్ నుంచి తాను విడిపోవడానికి.. తన కూతురు సుబ్బులక్ష్మి కెరీర్ కూడా ముఖ్య కారణాల్లో ఒకటిగా పేర్కొంది గౌతమి. ఇప్పుడు ఆమె ఇమ్మీడియట్ టార్గెట్ సుబ్బు లక్ష్మే అయింది. కమల్ నుంచి వేరుపడ్డ వెంటనే కూతురి మీద ఫోకస్ పెట్టిందామె. సుబ్బు లక్ష్మిని తమిళ సినిమాల్లో కథానాయికగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది గౌతమి. ఇందుకు కమల్ కూడా సహకారం అందిస్తున్నట్లు సమాచారం.

తమిళ సినీ పరిశ్రమలో గౌతమికి మంచి పరిచయాలే ఉన్నాయి. కమల్ బ్యాకప్ కూడా ఉంది కాబట్టి సుబ్బులక్ష్మికి సులువుగానే అవకాశాలు దక్కుతాయని భావిస్తోందామె. ముందుగా ఆమె ధనుష్ పక్కన తన కూతుర్ని నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్.. అక్షర హాసన్ ఇద్దరూ ధనుష్ పక్కన కథానాయికలుగా నటించారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడానికి అతనెప్పుడూ ముందుంటాడు. అందుకే తన కూతుర్ని ధనుష్ పక్కన నటింపజేయాలని భావిస్తోంది గౌతమి. మరోవైపు శివ కార్తికేయన్ పక్కన కూడా సుబ్బులక్ష్మిని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎలాగైనా తన కూతుర్ని హీరోయిన్ చేయాలని గౌతమి గట్టిగానే ట్రై చేస్తోంది. ఐతే గ్లామర్ పరంగా చూస్తే సుబ్బులక్ష్మి అంతంతమాత్రమే. మరి ఆమెకు అవకాశాలు దక్కినా... ఇండస్ట్రీలో ఏమాత్రం నిలదొక్కుకుంటందన్నదే డౌటు.

,  ,  ,  ,  ,  ,