Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Sep-2016 10:28:24
facebook Twitter Googleplus
Photo

నందమూరి నటసింహం బాలకృష్ణ.. తన వందో సినిగాగా గౌతిమిపుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జార్జియా.. మొరాకో దేశాల్లో ఇంటర్వెల్.. క్లైమాక్స్ లలో వచ్చే ప్రధాన యుద్ద సన్నివేశాలను దర్శకుడు క్రిష్ అండ్ టీం చిత్రీకరించేసింది. ఆ తర్వాత క్రిష్ పెళ్లి కోసం బ్రేక్ తీసుకున్న యూనిట్.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కోటల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

సినిమా స్టోరీకి కీలకమైన సన్నివేశాలు దాదాపు పూర్తి కానుండడంతో.. ఇక ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టనుంది శాతకర్ణి యూనిట్. ఇందుకు దసరా పండుగను ముహూర్తంగా నిర్ణయించారట. దసరాకి అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి టీజర్ ను అదే రోజున ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతున్నారు.

క్రిష్ పెళ్లి సమయంలో కొంత గ్రాఫిక్ వర్క్ కూడా కంప్లీట్ కావడంతో.. ఈ టీజర్ లో యుద్ధ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. బాలయ్య తల్లిగా హేమమాలిని.. భార్యగా శ్రియా శరణ్ లు కూడా ఈ టీజర్ లో కనిపించినా.. మొత్తంగా చూస్తే బాలయ్యను.. సబ్జెక్ట్ ను ప్రొజెక్ట్ చేసేలా గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ ఉండనుంది.

,  ,  ,  ,  ,