Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 12:33:28
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 రిలీజ్ కు మరొక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. రేపు గడిస్తే ఎల్లుండి కల్లా మెగాస్టార్ ను ఆన్ స్క్రీన్ పై చూడబోతున్నామన్న ఉత్సాహం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇది నాకు కంబ్యాక్ మూవీ అంటూ స్వయంగా మెగాస్టార్ ఉద్వేగం ప్రదర్శించారు. ఇక ఫ్యాన్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా!!

అయితే.. చిరు రీ ఎంట్రీపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బోలెడంత హంగామా నడుస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖైదీ నంబర్ 150 రిలీజ్ అవుతోంది. సాధారణంగా కర్నాటకలో మన సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. ఇతర ఏరియాల్లో చిన్నాచితకా రిలీజ్ లు ఉంటాయి. కానీ ఖైదీ నంబర్ 150 రిలీజ్ కోసం.. ఏకంగా అక్కడి పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు. ఇలా ఓ తెలుగు సినిమాను నేరుగా రిలీజ్ చేస్తూ.. మరాఠి పేపర్ లో యాడ్ కనిపించడం చాలా అరుదైన విషయం. మహారాష్ట్రలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇలాంటి బజ్ చాలానే ఉంది.

అహ్మదాబాద్ లో కూడా అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోస్ వేసి ఫ్యాన్స్ హంగామా చేయబోతున్నారంటే.. మెగా రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూపులు చూస్తున్నారో అర్ధమవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టంతా.. తొలిరోజున మెగాస్టార్ కలెక్షన్స్ విషయంలో ఎన్ని రికార్డులు బద్దలు కొడతారా అనే!

,  ,  ,  ,  ,  ,