Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2015 17:03:51
facebook Twitter Googleplus
Photo

ఎవరిమధ్యా ఎంతో కాలం శతృత్వం ఉండదంటున్నాడు శ్రీనువైట్ల. గొడవైంది కదా అని ప్రకాష్ రాజ్ తో కలిసి పనిచేయడం మానేయలేనని మేమిద్దరం మళ్లీ ఒక్కటయ్యామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ప్రకాష్ రాజ్ తో కలిసి సినిమా చేయబోతున్నానని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఆగడు సెట్లో శ్రీనువైట్ల - ప్రకాష్ రాజ్ కీ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ అర్ధంతరంగా ఆ సినిమా సెట్ నుంచి బయటికొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొన్నారు. ఆ వ్యవహారం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ నిర్మాతల మండలి వరకు వెళ్లింది. అదంతా చూసినవాళ్లు ఇక ఇద్దరూ కలిసి పనిచేయడం చూడలేమేమో అనుకొన్నారు. కానీ ఇప్పుడు శ్రీనువైట్ల మాత్రం మళ్లీ మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నాం అని స్పష్టం చేశాడు.

దర్శకుడు శ్రీనువైట్లకి ఆగడు సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాకి ముందు చాలా రభసే జరిగింది. తన ఆస్థాన రచయితగా ఉన్న కోన వెంకట్ తో సంబంధాలు తెంచుకొన్నాడు. సొంతంగానే స్క్రిప్టుని తయారు చేసుకొని ఆగడు మొదలుపెట్టాడు. తీరా సెట్ కి వెళ్లాక అక్కడ ప్రకాష్ రాజ్ తోనూ గొడవైంది. ఇద్దరి మధ్య ఈగో సమస్యలు తలెత్తడంతో ఆ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ బయటికొచ్చాడు. ఆగడు విడుదలయ్యాక ఆ రభస మళ్లీ మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో చెప్పిన డైలాగుని శ్రీనువైట్ల సినిమాలో విలన్ తో చెప్పించేశాడు. ఆ విషయంపైన కూడా ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శలు చేశాడు. ఆ రకంగా ఆగడు సినిమా శ్రీనువైట్లకి అన్ని విధాలుగా తలనొప్పులు తెచ్చిపెట్టింది.

కానీ రామ్ చరణ్ మళ్లీ వీళ్లందరినీ ఒక్కటి చేసినట్టు తెలుస్తోంది. మొదట కోననీ - శ్రీనువైట్లనీ కలిపాడు చరణ్. దీంతో వీళ్ల కాంబినేసన్ లో `బ్రూస్ లీ` తెరకెక్కింది. ఆ సినిమా ప్రమోషన్ వ్యవహారాల్లో బిజీగా గడుపుతున్న శ్రీనువైట్ల ఇటీవల విలేకర్లతో ముచ్చటించాడు. కోనతో కలిసిపోయారు ప్రకాష్ రాజ్ తోనూ కలిసిపోతారా అన్న ప్రశ్నకు స్పందిచిన శ్రీనువైట్ల... ఏ క్షణమైనా మేం కలవొచ్చని జవాబిచ్చాడు. మేమిద్దరం మళ్లీ ఒక్కటయ్యామని మా మధ్య ఇప్పుడు ఎలాంటి శతృత్వం లేదని వివరించాడు. ఆమధ్య ప్రకాష్ రాజ్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీనువైట్ల స్వయంగా ఆయన ఫామ్ హౌస్ కి వెళ్లి శుభాకాంక్షలు చెప్పొచ్చాడు. చరణ్ - కోన వెంకట్ - దానయ్య తదితరులంతా శ్రీను వైట్లనీ - ప్రకాష్ రాజ్ నీ కలిపేశారని తెలుస్తోంది. సో... శ్రీనువైట్ల తదుపరి చేయనున్న సినిమాలో ప్రకాష్ రాజ్ కచ్చితంగా సందడి చేయబోతున్నాడన్నమాట

,  ,