Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Nov-2016 12:14:02
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలుసు. క్రీస్తు శకం 3 వ శతాబ్దం నాటి అమరావతి పాలకుడు.. తెలుగు చక్రవర్తి.. పోరాట యోధుడు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కథను కళ్లకు కట్టినట్లు చూపబోతున్నాడు దర్శకుడు క్రిష్. అయితే.. చరిత్రలో ఇంత వెనక్కు వెళ్లి రెండున్నర గంటల పాటు సినిమా తీయాలంటే.. ఆ స్థాయిలో సెట్స్ వేయాలి.. లేదా గ్రాఫిక్స్ లో అయినా అప్పటి కాలాన్ని చూపాలి. ఇప్పటి ట్రెండ్ ప్రకారం భారీ సెట్స్ కంటే.. గ్రాఫిక్స్ తో సినిమా తీయడమే బెటర్ అనే నిర్ణయానికి మూవీ మేకర్స్ ఎప్పుడో వచ్చేశారు.

అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణిలో గ్రాఫిక్స్ కోసం ఎంత మొత్తాన్ని కేటాయిస్తున్నారనే విషయంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ మొత్తం 55 కోట్లు అని అంచనాలు ఉండగా.. ఇందులో 10 కోట్ల రూపాయలను కేవలం గ్రాఫిక్స్ పైనే వెచ్చించనున్నారట. తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ఇది పెద్ద మొత్తమే కానీ.. నిజానికి ఈ స్థాయి చారిత్రక చిత్రానికి మాత్రం తక్కువే. కానీ ఈ పరిధిలోనే గ్రాఫిక్స్ ను పూర్తి చేసేందుకు అందులోనూ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు క్రిష్ ఓ సూపర్బ్ ఐడియా వేశాడట.

మొత్తం సన్నివేశాల్లో 90శాతం తనే షూటింగ్ చేసేస్తున్నాడట. కేవలం 10 శాతం సీన్స్ కు మాత్రమే పూర్తిగా గ్రాఫిక్స్ వాడాల్సి వస్తుంది. మిగిలిన సన్నివేశాలకు.. తక్కువ ఖర్చుతోనే గ్రాఫిక్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేశాడట క్రిష్. ఎక్కువగా యుద్ధ సన్నివేశాల్లోనే గ్రాఫిక్ విజువల్స్ ఉండేలా ప్లానింగ్ చేయడంతోనే.. 10 కోట్ల బడ్జెట్ తోనే ఈ ఎఫెక్ట్స్ పూర్తి కానున్నాయని తెలుస్తోంది. ఇక డిసెంబర్ రెండో వారం చివరకే.. శాతకర్ణి ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్న యూనిట్.. పొంగల్ కు రావడం మాత్రం ఖాయం అని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,  ,