Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:35:33
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ ట్రైలర్ రానే వచ్చేసింది. మహేష్ బాబు హీరోగా మరుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 27న రిలీజవుతున్న సందర్భంగా.. ఈరోజు గ్రాండ్ గా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. కాకపోతే అర్ధరాత్రినే ట్రైలర్ మాత్రం రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

నిజానికి స్పైడర్ సినిమాలో మహేష్ ఒక సిబిఐ ఏజెంట్ అంటూ ముందు నుండి వస్తున్న రూమర్లన్నీ నిజం చేస్తూ.. ఆల్రెడీ టీజర్ వచ్చింది. ఇప్పుడు అదే విషయంపై ఇంకాస్త క్లారిటీ ఇచ్చేశారంతే. ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేసే ఏజెంట్ శివ.. ఫోన్లో ఎవరివైనా బెదిరింపులు గట్రా వింటే ఎలర్ట్ అయిపోతాడు. నేను స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు.. సొసైటీని నేను మార్చట్లేదు అంటున్న ఈ స్పై.. మనుషులు ఎక్కువైపోయారు కాబట్టి వారిని చంపేస్తున్నాను అంటున్న విలన్ ను ఎదుర్కొని సైసైటీని కాపాడుతున్నాడు. ఆ సమయంలో ఆ విలన్ ఏం చేశాడు.. మనోడు చివరకు ఏం చేస్తాడు అనేదే సినిమా అని తెలుస్తోంది. మురుగుదాస్ మార్కు సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. విజువల్స్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా పెద్దపెద్ద ఫ్లై ఓవర్లను కూల్చడం.. అలాగే వియత్నాంలో షూట్ చేసిన థీమ్ పార్కు ఎపిసోడ్.. మొత్తంగా అదిరాయ్. రకుల్ అండ్ మహేష్ మధ్యన కెమిస్ర్టీ కూడా కిస్ కిస్ అంటోంది.

ముఖ్యంగా ఈ సినిమాకు సంతోష్ శివన్ విజువల్స్.. అలాగే హ్యారిస్ జయరాజ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా మురుగుదాస్ మార్కు ట్రైలర్ ఇది.

,  ,  ,  ,  ,