Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2015 17:02:06
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించనున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్ లో ముమ్మరంగా జరుగుతున్న చర్చ ఈ టాపిక్ పైనే! కొన్నేళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్లోనూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి పెద్దగా ప్రయత్నాలు జరిగాయి. అయితే, వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హేమాహేమీల కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిరంజీవి తన 150వ చిత్రం చేయడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతీ, అందుకు తగ్గా కథ లభ్యం కాని సంగతీ మనకు తెలిసిందే. దీంతో దర్శకుడు శంకర్ ఇప్పుడు చిరంజీవికి కథ తయారుచేసే పనిలో పడుతున్నట్టు చెబుతున్నారు. శంకర్ తో సినిమా చేయాలని చిరంజీవి కూడా కోరుకుంటున్నారు కాబట్టి, స్టార్ హీరోలను ఎలా ప్రెజంట్ చేయాలో శంకర్ కి క్షుణ్ణంగా తెలుసు కాబట్టీ ఇది కార్యరూపం దాల్చవచ్చని సమాచారం.

,  ,  ,  ,  ,