నాని హీరోగా నటించిన ?జెంటిల్మన్? సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ?ఎవడే సుబ్రమణ్యం?, ?భలే భలే మగాడివోయ్?, ?కృష్ణగాడి వీర ప్రేమ గాథ? లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నాని నటించిన సినిమా కావడంతో ?జెంటిల్మన్?కు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. ఇక సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు చేరువై మెప్పించడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. రెండో వారం కూడా సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో అంతటా రెండో వారాంతం మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర్నుంచి అందిన సమాచారం బట్టి చూస్తే, అన్ని ఏరియాల్లో సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టిందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం, యూఎస్‌లో ఈ సినిమాను పెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చని ట్రేడ్ టాక్. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌లో నాని సరసన సురభి, నివేథా థామస్ హీరోయిన్లుగా నటించారు. శివలంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.