Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 10:55:02
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ జక్కన్న ఇప్పటివరకూ పరాజయం అనేది లేకుండా సాగిపోతున్నాడు. అసలు ఫెయిల్యూర్ అనేదే లేనప్పుడు.. పాఠం నేర్చుకోవడమేంటి అనుకోవచ్చు కానీ.. రాజమౌళికి కూడా ఓ ఫెయిల్యూర్ తప్పలేదు. ఆ షాక్ ఇచ్చినది కూడా బాహుబలి మూవీనే కావడం ఆశ్చర్యకరమే.

రీసెంట్ గా బాహుబలి ది బిగినింగ్ జర్మన్ వెర్షన్ విడుదలైంది. అక్కడ పూర్తి స్థాయి డిజాస్టర్ గా నిలిచింది బాహుబలి. కనీస స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో లేకపోవడంతో.. థియేటర్ల నుంచి సినిమాను తొలగించాల్సి వచ్చింది. ఇందుకు కారణాలను తొందరగానే పసిగట్టాడు మన జక్కన్న. ఇక్కడ బాహుబలి ఆ రేంజ్ సక్సెస్ సాధించడానికి.. కంటెంట్ కంటే ఎక్కువగా పబ్లిసిటీ ఉపయోగపడింది. రకరకాల టెక్నిక్స్ తో హైప్ తీసుకురావడం.. బాహుబలికి బాగా ప్లస్ అయింది.

అందుకే ఇప్పుడు చైనీస్ వెర్షన్ విషయంలో బాగా అలర్ట్ గా ఉంటున్నాడు రాజమౌళి. త్వరలో చైనాలో భారీ ఎత్తున బాహబలి విడుదల కానుండడంతో.. యూనిట్ అంతా చైనా వెళ్లి ప్రమోషన్స్ ప్రారంభించారు. అక్కడి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అయిపోయి.. పబ్లిసిటీ కార్యక్రమాలు హ్యాండిల్ చేస్తున్నారు. అలా జర్మన్ బాహుబలి ఇచ్చిన షాక్ నుంచి పాఠాలు నేర్చుకున్న రాజమౌళి.. మిగిలిన వెర్షన్స్ విషయంలో జాగ్రత్తలు పడ్డానికి కారణం అయింది

,  ,  ,  ,  ,  ,