Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:06:57
facebook Twitter Googleplus
Photo

ముంబై: బాహుబలి చిత్రం విడుదలైనప్పటి నుంచీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇండియాలో ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతికిన సినిమాల లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. మూడో స్థానంలో నిలిచి మన తెలుగు వారి సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. అయితే మిగతా ఏ సినిమాలు గూగుల్ సెర్చ్ లో చోటు చేసుకున్నాయి. టాప్ 10 లిస్ట్ ఈ క్రింద మీరు చూడవచ్చు. ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచంలో ఇంటర్నెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజన్. గత కొన్నేళ్లుగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏ సినిమా స్టార్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డాడనే విషయంలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పటి లానే ఈ సంవత్సరం కూడా గూగుల్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రిటీల లిస్టు విడుదల చేసింది. అయితే గత పదేళ్లుగా ఏ హీరోని ఎక్కువ సెర్చ్ చేసారనే విషయం తెలియచేసింది. గత దశాబ్ద కాలంలో గూగుల్ ఎక్కువగా వెదికిన భారతీయ నటీ నటులుగా బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సన్నీలియోన్లు మొదటిస్థానం దక్కించుకున్నారు. సల్మాన్ తర్వాత షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్జీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు. హీరోయిన్ల జాబితాలో సన్నీ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా తమన్నా అలియా భట్, సోనాక్షిసిన్హాలు గూగుల్ జాబితాలో నిలిచారు. క్లాసిక్ నటుల్లో అమితాబ్ బచ్చన్, రేఖలు మొదటి స్థానాల్లో నిలిచారు. అమితాబ్ తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా మిథున్ చక్రవర్తి,, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు.

,  ,  ,  ,  ,  ,