Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Dec-2014 10:52:12
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం బిజినెస్ లో దూకుడుగా వుంది. ప్రతి ఏరియాకూ భారీ రేటు పలుకుతోంది. తాజాగా నైజాం హక్కులు 13.4 (NRA పద్ధతిలో) కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు ఈ రేటుకి ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం ఆడియో వేడుకను జనవరి 3న కాకుండా నూతన సంవత్సరం రోజున (జనవరి 1) హైదరాబాదు శిల్ప కళావేదికలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్, వెంకీ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం వుంది!

,  ,  ,  ,  ,  ,  ,