Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 15:16:31
facebook Twitter Googleplus
Photo

ఆరు నూరైనా.. నూరు నూటపాతికైనా కూడా.. హీరోయిన్ సమంత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసి తన సత్తా ఏంటో చాటేయాలని తెగ ప్రయత్నిస్తోంది. మొన్న 24 సినిమా బాగుందని చెప్పినా.. అందులో సమంత పాత్రను అందరూ క్రిటిసైజ్ చేశారు. ఆ తరువాత బ్రహ్మోత్సవం నిరాశే మిగల్చింది. అందుకే మాంచి కసి మీద ఉన్న సమంత.. ఇప్పుడు సినిమా గురించి చాలా విషయాలే చెబుతోంది. అంతే కాదు.. ఇదే ఆఖరి సినిమా అంటోంది.

''అ..ఆ సినిమాలో నాకొచ్చినదంతా దింపేశాను. ఇంకోసారి లవ్ స్టోరీలు చేయను. చేయలేను కూడా. ఇదే నా కెరియర్ లో ఆఖరి లవ్ స్టోరి'' అని తేల్చేసింది సమంత. ఇప్పటివరకు తన కెరియర్ లో చేసిన లవ్ స్టోరీలన్నీ ఒకెత్తయితే.. ఈ కథ మాత్రం మరో ఎత్తు.. అని చెబుతోంది. ''ఈ సినిమా నా దగ్గర నుండి చాలా డిమాండ్ చేసింది. ముఖ్యంగా క్లయ్ మ్యాక్స్ సీన్లో అయితే.. అందరూ నవ్వుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉంటే.. నేను మాత్రం సీరియస్ లుక్ లో ఏడుస్తూ ఉండాలి. అది చాలా కష్టం. పక్కనే పోసాని గారు వగైరా వగైరా ఆర్టిస్టులు ఉన్నప్పుడు.. ఖచ్చితంగా మనకు నవ్వొచ్చేస్తుంది. అంత కష్టపడి మళ్లీ ఇంకో సినిమా చేయాలంటే కష్టమే'' అంటూ సమంత ఈ సినిమా గురించి గొప్పలు పోయింది.

బాగానే ఉంది. అసలు సమంత ఇంకో లవ్ స్టోరీ చేయలేను అంటే ఓకె. అంతేకాని.. అసలు సినిమాలే చేయలేను.. హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నా అని చెబితే మాత్రం.. అభిమానులు హర్టవుతారమ్మాయ్.

,  ,  ,  ,  ,  ,  ,