Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 13:06:52
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ పాపులర్ చేసిన గౌతమ్ నందా అనే పేరును ఇప్పుడు టైటిల్ గా మార్చుకున్నాడు హీరో గోపిచంద్. రచ్చ సినిమా తీసిన సంపత్ నంది డైరక్షన్లో ఇప్పుడు ''గౌతమ్ నందా'' అంటూ దూసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం గోపిచంద్ ఆల్రెడీ స్లిమ్ అండ్ ట్రిమ్ గా తయారై తన లుక్ తోనే మ్యాజిక్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త ఫీట్ చేశాడు.

యాక్షన్ సీన్స్ అన్నీ ఎప్పుడూ స్పెషల్ గా చేసే గోపిచంద్.. ఇప్పుడు గౌతమ్ నంద సినిమా కోసం ఓ రిస్కీ స్టంట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా ఓ పూర్తి స్థాయి స్కైడైవ్ సీక్వెన్స్ తీసినట్లు సంపత్ నంది గతరాత్రి పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపిన దర్శకుడు దుబాయ్ లో ఫారిన్ ఎక్సపర్టుల సహకారంతో స్కైడైవ్ కు రెడీ అవుతున్న గోపిచంద్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఈ సీక్వెన్స్ అంతా సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ లో వస్తుందని తెలుస్తోంది

మొత్తానికి గాల్లో తేలుతున్న గౌతమ్ నందా ఉరఫ్ గోపిచంద్.. ఇప్పుడు హిట్టు కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,