Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:01:02
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం మూడు భాషల్లో నటిస్తున్న క్రెడిట్ మన యంగ్ హీరోలలో రానా దగ్గుబాటికి దక్కింది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటిస్తున్న ఈ పొడగరి హీరో తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బెంగళూర్ డేస్' తమిళ రీమేక్ లో ఓ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. ఇదిలా ఉంచితే, తాజాగా మరో తమిళ సినిమాకి రానా సంతకం చేశాడు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడానికి మనవాడు అంగీకరించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో కూడా జాయిన్ అవుతాడు.

,  ,  ,  ,  ,