Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2015 11:44:35
facebook Twitter Googleplus
Photo

సాధారణంగా దర్శకులు తాము ఏ హీరోతోనైతే సినిమాని తెరకెక్కించాలని అనుకుంటారో, ఆ హీరోకి తగినవిధంగా కథను సిద్ధం చేసుకుంటారు. ఆ హీరోతో ఆ సినిమా చేయలేకపోయినప్పుడు, మరో హీరో బాడీలాంగ్వేజ్ కి తగినవిధంగా ఆ కథను మార్చుకుంటారు. అలా గతంలో తనకి నచ్చలేదని సూర్య చెప్పిన కథని, విక్రమ్ బాడీ లాంగ్వేజ్ కి తగినవిధంగా మార్చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. 'ధృవ నక్షత్రం' పేరుతో ఆయన తయారుచేసుకున్న ఈ కథ సూర్యకి అంత సంతృప్తికరంగా అనిపించలేదట. దాంతో ఆయన గౌతమ్ మీనన్ నుంచి వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడు.

ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విక్రమ్ కనిపించనున్నాడు. గతంలో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన 'సామి' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇక పోలీస్ కథలను తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ ఎంత సిద్ధహస్తుడో ఆయన గతచిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం శింబుతో సినిమా చేస్తోన్న గౌతమ్ మీనన్, ఆ తరువాత ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. 'ఐ' సినిమా పరాజయంతో నిరాశపడిన విక్రమ్ అభిమానులకి ఈ వార్త ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు.

,  ,  ,  ,  ,