Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 13:30:10
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: నాని, నితిన్, నిత్యా మీనన్ ఈ ముగ్గురు పేర్లు వినగానే 'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటిచిత్రాలు గుర్తుకొస్తాయి. ఈ ఇద్దరు హీరోలతో రెండే సినిమాలు చేసిన నిత్యా మీనన్ వారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. నిత్యా మీనన్ మళయాలంలో నటించిన చిత్రం తెలుగులో 100 డేస్ ఆఫ్ ల‌వ్‌ పేరుతో రిలీజవుతోంది. దుల్క్ సల్మాన్ హీరో. జీన‌స్ మొహ్మ‌ద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తెలుగు ఆడియో రిలీజ్ వేడుక బుధవారం సాయంత్రం నాని, నితిన్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఎస్ ఎస్ సీ మూవీస్ స‌మ‌ర్ఫ‌ణ‌లో ఎస్‌. వెంక‌ట్ ర‌త్నం తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ విడుద‌ల చేస్తోంది. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లయ్యాయి. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ నిత్యామీన‌న్‌తో క‌లిసి ఇప్ప‌టికి రెండు సినిమాలు చేశాను. నాని కూడా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు నిత్యామీన‌న్ పెద్ద స్టార్ రేంజ్‌కి ఎదిగింది. మేం ముగ్గురం క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని ఉంది. అది కూడా వెంక‌ట్‌కే చేయాల‌ని ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ నుంచి డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత స్థాయికి ఎదిగాడు వెంక‌ట్‌. త‌న‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు.

,  ,  ,  ,  ,  ,