Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 16:39:50
facebook Twitter Googleplus
Photo


వినూత్నమైన సబ్జెక్టులను ఎంచుకోవడమే కాక నిత్య నూతనమైన ప్రచార సాధనాలను అలవర్చుకోవడంలో సైతం దర్శకుడు క్రిష్ ముందడుగు వేస్తున్నాడు. ఆయన తెరకెక్కించిన గౌతమీ పుత్రా శాతకర్ణి చిత్రం విడుదలకు సిద్ధమవుతుండడంతో పబ్లిసిటీపై దృష్టి సారించారు.

సోషల్ మీడియాలో అందరి పేర్లకు ముందూ తమ తల్లి పేర్లను జత చేసి గౌతమీ పుత్రుడికి స్వాగతం తెలుపమని ఇప్పటికే ఒక కొత్త పంధాని అనుసరించారు. ఇప్పుడు అభిమానులకు కానుకగా గౌతమీ పుత్రుడికి విజయ చిహ్నంగా నిలిచిన జెండాతో ఫ్లాగ్ ఫెస్టివల్ నిర్వహించే పనిలో వున్నట్టు సమాచారం.

సంక్రాంతి ని పురస్కరించుని విడుదలకానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. తెలుగు వాడి చరిత్రను వెండితెరపై ఆవిషరించబోతున్న క్రిష్ కి ఆల్ ది బెస్ట్ చెబుదామా..

,  ,  ,  ,  ,