Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 15:19:19
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల శాటిలైట్ హక్కుల మార్కెట్ బాగా పెరిగింది. అదే సమయంలో ఓవర్సీస్ హక్కులకూ గిరాకీ ఎక్కువైంది. దీనికి తోడు ఇప్పుడు డిజిటల్ హక్కులు.. హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి కూడా నిర్మాతలకు మంచి ఆదాయం అందుతోంది. సినిమాకు మంచి బజ్ వస్తే.. టాక్ కూడా బాగుంటే ఊహించని రేట్లు పలుకుతున్నాయి సినిమాలకు. అమేజాన్ ప్రైమ్ రంగ ప్రవేశంతో డిజిటల్ హక్కులకు గిరాకీ బాగా పెరిగింది.

కొన్ని సినిమాలకు కళ్లు చెదిరే రేటు ఇస్తోంది అమేజాన్ ప్రైమ్. చిన్న సినిమాల్ని కూడా ఆ సంస్థ బాగానే ఆదరిస్తోంది. కొన్ని నెలల కిందట సెన్సేషనల్ హిట్టయిన అర్జున్ రెడ్డి సినిమాకు రూ.1.6 కోట్లు ఇచ్చి డిజిటల్ రైట్స్ తీసుకుంది అమేజాన్. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే ఎలాంటి హంగామా కనిపిస్తుందో.. ఆన్ లైన్ రిలీజ్ విషయంలోనూ అలాంటి సందడే కనిపించింది. అర్జున్ రెడ్డి ఆన్ లైన్లోనూ బ్లాక్ బస్టరే కావడం విశేషం. అమేజాన్ ప్రైమ్ కు ఈ సినిమా చాలా మంచి ఫలితాన్ని అందించిందట.

అర్జున్ రెడ్డి ఇచ్చిన ఊపుతో మరో న్యూ వేవ్ మూవీ మీద అమేజాన్ ప్రైమ్ దృష్టిపెట్టింది. సురేష్ బాబు విడుదల చేస్తున్న మెంటల్ మదిలో కు కూడా అర్జున్ రెడ్డి కి ఇచ్చిన రేటే ఇచ్చిందట ఆ సంస్థ. ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడిలో నాలుగింట మూడొంతులు డిజిటల్ హక్కుల రూపంలోనే వచ్చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి రూ.2 కోట్లే ఖర్చయిందట. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేథా పెతురాజ్ జంటగా నటించారు.

,  ,  ,  ,  ,