సీనియర్ దర్శకుడు గుణశేఖర్ బాహుబలి: ది కంక్లూజన్ ను ప్రశంసిస్తూ.. ఇది సింపుల్ స్టోరీ అని ప్రస్తావించడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆయనేదో మామూలుగా ఈ మాట అన్నారేమో కానీ.. సోషల్ మీడియాలో జనాలు మాత్రం దాన్ని పెద్ద బూతు లాగా క్రియేట్ చేసేశారు. నిజానికి కథగా చెప్పుకుంటే బాహుబలి సింపులే. కానీ దాన్ని రాజమౌళి తనదైన శైలిలో తెరమీద ప్రెజెంట్ చేయడంతో అది గొప్పగా అనిపించి ఉండవచ్చు. మొత్తానికి తాను చేసిన సింపుల్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గుణశేఖర్ అప్రమత్తం అయ్యాడు. ఆ వ్యాఖ్యల్ని కవర్ చేస్తూ కొత్తగా ఒక మెసేజ్ పెట్టాడు.
బాహుబలి టీంలో ఒక్కో రోజు ఒక్కో విభాగం గురించి ప్రశంసలు కురిపిస్తున్న గుణ.. తాజాగా విజయేంద్ర ప్రసాద్ మీద ఫోకస్ చేశాడు. 3డీ.. ఐమాక్స్.. వీఆర్ లాంటి ఎన్ని టెక్నాలజీలు వచ్చినప్పటికీ హ్యూమన్ ఎమోషన్స్ అన్నవే అత్యంత కీలకమని.. అవే ప్రధానంగా సినిమాను నడిపిస్తాయని విజయేంద్ర ప్రసాద్ మరోసారి రుజువు చేశారని గుణ అన్నాడు. బాహుబలి కథ వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చని.. కానీ పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్లతో తెలివిగా మలిచిన తీరు కారణంగా బాహుబలి కళాఖండం అయిందని అభిప్రాయపడ్డాడు గుణ. డైలాగ్ రైటర్లు అజయ్.. విజయ్ లను కూడా గుణ అభినందించాడు. మొత్తానికి తాను చేసిన ‘సింపుల్’ వ్యాఖ్యలపై వివరణ లాగే ఉంది ఈ మెసేజ్