Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 12:53:21
facebook Twitter Googleplus
Photo

హను రాఘవపూడి ఇప్పుడు తన కొత్త సినిమా లై ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాడు. మొదటి సినిమాలో కథ అంతగా ఆకట్టుకోలేకపోయినా హను రాఘవపూడి డైరక్షన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి చాలా మంది యంగ్ హీరోలు నాతో చేయు అంటే నాతొ అని పోటీపడుతున్నారు. కానీ అందాల రాక్షసి సినిమా తరువాత హను రాఘవపూడి నేచురల్ హీరో నాని తో కృష్ణగాడి వీర ప్రేమ గాధ తీసి కమర్షియల్ హిట్ కొట్టాడు.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తరువాత హను రాఘవపూడి అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేయవలిసి ఉంది. కానీ అఖిల్ తన మొదటి సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో అతనికి ఒక కమర్షియల్ హిట్ అవసరం ఉంది అని భావించి అక్కినేని నాగార్జున హను రాఘవపూడి సినిమాను కాదన్నాడట. కానీ ఆ కథ అఖిల్ కి బాగా నచ్చింది అని తెలుస్తుంది. ఈ క్రమంలో అఖిల్ విక్రమ్ కె.కుమార్ ల ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అఖిల్ చెప్పిన కథే నితిన్ తో తీశాడని ఒక టాక్. దానికి హను రాఘవపూడి స్పందిస్తూ నేను అఖిల్ కు చెప్పిన కథ వేరు లై సినిమా కథ వేరు. అఖిల్ ఇప్పుడు ఓకే అని చెప్పినా.. ఆ కథతో సినిమా మొదలుపెట్టడానికి నేను సిద్దం'' అని చెప్పాడు.

అఖిల్ కి ఆ కథ ఎలాగూ నచ్చింది కాబట్టి ‘లై’ సినిమా హిట్ అయితే నాగార్జున కూడా అడ్డు చెప్పడానికి పెద్ద కారణాలు ఏవి ఉండవు కావున హను రాఘవపూడి ఖచ్చితంగా అఖిల్ తో సినిమా చేస్తాడు అని ఒక అంచనాకు రావచ్చు మనం. మరి కొంతమంది యంగ్ హీరోలు అయితే లై సినిమా ఫలితాలు తో మాకు పని లేదు హను తో పని చేయడమే మాకు కావాలి అని ఎగబడిపోతున్నారు అంట. తనకు ఇలా ఎన్ని ఆఫర్లు వస్తున్నా లై సినిమా మేటర్ పూర్తి కానివ్వండి ఆ తరువాత మాట్లాడుకుందాం అంటున్నాడు రాఘవపూడి.

,  ,  ,  ,  ,