Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2016 15:46:57
facebook Twitter Googleplus
Photo

హర్రర్ కామెడీ అన్నది గత ఐదు సంవత్సరాలుగా తెలుగులో బాగా పాపులర్ అయిన జానర్. ఈ జానర్లోనే వరుసగా విజయాలు సాధించి దర్శకుడు లారెన్స్ హర్రర్ కామెడీని అంతటా పాపులర్ చేశారు. ఇక ఇప్పుడిదే జానర్‍లో స్టార్ హీరోలు కూడా నటించాలన్న ఉత్సుకత చూపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో అల్లరి నరేష్ ఈ జానర్‌లో ఓ సినిమా చేస్తూండగా, తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా హర్రర్ కామెడీపై ఆసక్తి కనబరచడం విశేషంగా చెప్పుకోవాలి. ఆయన హీరోగా నటించిన ?బాబు బంగారం? సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ వెంకీ హర్రర్ కామెడీ ప్రస్తావన తెచ్చారు.
హర్రర్ కామెడీలో ఏదైనా కొత్త అంశాన్ని చూపించేలా ఓ సినిమా చేస్తే బాగుంటుందేమో అని వెంకటేష్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో ఆయన తనకు హర్రర్ కామెడీ చేయాలన్న ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పారు. రొటీన్‌గా కాకుండా, ఈ జానర్‌లో ఏదైనా మంచి కథతో వస్తే సినిమా చేయాలని ఆలోచిస్తున్నటు వెంకీ తెలిపారు. ఇక బాబు బంగారం సినిమా విషయానికి వస్తే, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఆగష్టు 12న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

,  ,  ,  ,  ,  ,  ,