Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 11:39:11
facebook Twitter Googleplus
Photo

పిల్ల జమిందార్ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన హరిప్రియ గుర్తుందిగా.. ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్టయినా ఆమెకు అంత పేరేం రాలేదు. ఆ తరవాత రెండు సినిమాల్లో నటించినా అవీ పెద్ద హిట్ కాలేదు. తెలుగులో సక్సెస్ లేకపోవడంతో టాలీవుడ్ కు పేకప్ చెప్పేసి శాండల్ వుడ్ కు షిఫ్టయిపోయిన హరిప్రియ ఇప్పుడు కన్నడలో టాప్ పొజిషన్ లో ఉంది.

దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో హరిప్రియ చివరిగా తెలుగులో నటించింది. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్ కు తిరిగిస్తోంది. బాలకృష్ణ హీరోగా తమిళ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ‘‘ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్లొచ్చాయి. అవేవీ నాకు అంత ఎక్సయిటింగ్ గా అనిపించలేదు. ప్రస్తుతం కన్నడ-తమిళ్ సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్నా బాలకృష్ణ సినిమాకు సంబంధించి నా పాత్ర తీరుతెన్నులు కొత్తగా అనిపించడంతో నటించేందుకు ఒప్పుకున్నా. తెలుగులో తిరిగి కనిపించడం చాలా ఆనందంగా ఉందని’’ హరిప్రియ అంటోంది.

ప్రస్తుతం హరిప్రియ చేతినిండా కన్నడ సినిమాలున్నాయి. ఒకేసారి ఆరు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పక్కన కూడా ఓ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో ఒకటి.. మళయాళంలో ఒకటి చేస్తోంది. ఇప్పుడు తెలుగులో చేయడానికి ఓకే చెప్పింది.

,  ,  ,  ,  ,