Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:19:39
facebook Twitter Googleplus
Photo

సహజంగా అల్లు అర్జున్ ఏడాదికి ఒక సినిమా చొప్పున తీసుకుంటూ తన స్పీడ్ లో తాను ఉంటాడు. ఏటేటా సమ్మర్ కి సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకోవడం బన్నీకి అలవాటు. కానీ ఈ సారి మాత్రం సమ్మర్ పూర్తయిపోయాక డీజే-దువ్వాడ జగన్నాధం అంటూ వస్తున్న స్టైలిష్ స్టార్ మరో విషయంలో కూడా స్టైల్ మార్చాడు.

ఒక సినిమా పూర్తయ్యాకే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే బన్నీ.. డీజే ఫినిష్ అయేందుకు ముందే వక్కంతం వంశీతో సినిమాకి సై అన్నాడు. నా పేరు సూర్య అనే టైటిల్ తో.. నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో మూవీ చేస్తుండగా.. ఇప్పుడీ ప్రాజెక్టుకి ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీలో నటించిన రష్మిక మందన పేరు ఎక్కువగానే వినిపించింది. ఈమెనే హీరోయిన్ గా ఖాయం చేసేస్తారని అంతా భావించారు. అయితే.. తమ చిత్రంలో రష్మిక నటించడం లేదంటూ చెప్పేశారు నా పేరు సూర్య మేకర్స్. ఇంకా ఏ హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదని కూడా అంటున్నారు.

అయితే.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో మలయాళీ భామ నివేదా థామస్ తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ పై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేసిన అల్లు అర్జున్.. డీజే ప్రచార పనులు పూర్తి కాగానే.. నా పేరు సూర్యకు వర్క్ స్టార్ట్ చేసేయనున్నాడు.

,  ,  ,  ,  ,  ,