Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 14:56:32
facebook Twitter Googleplus
Photo

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ కురుక్షేత్ర. భారీ బడ్జెట్ తో.. అత్యంత భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కించనుండగా.. ఇప్పుడీ మూవీలో హరిప్రియను ఖాయం చేశారన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరో దర్శన్ 50వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

సీనియర్ నటుడు రవిచంద్రన్.. కురుక్షేత్రలో యాక్ట్ చేస్తుండగా.. ఈయన కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈయన మినహాయిస్తే.. ఇతర వివరాలు ఏమీ తెలియడం లేదు. కానీ.. హీరోయిన్ హరిప్రియను ఈ చిత్రంలోకి తీసుకున్నారనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. యూనిట్ వర్గాల నుంచి ఈ విషయంపై క్లారిటీ వచ్చినా.. ఆమెను ఏ రోల్ కోసం తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. జూలై 30న కురుక్షేత్ర మూవీ లాంఛింగ్ సందర్భంగా.. అన్ని వివరాలను వెల్లడించే వరకూ ఆగాల్సిందే అంటున్నారు.

హరిప్రియ చేయనున్న రోల్ తెలిస్తే.. అందరూ థ్రిల్ ఫీలవుతారట. మరోవైపు.. ఇతర తారాగణాన్ని ఫైనల్ చేయడంలో దర్శక నిర్మాతలు తెగ బిజీగా ఉన్నారు.

,  ,  ,  ,