Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2017 17:39:32
facebook Twitter Googleplus
Photo

మూడూ భారీ సినిమాలే . భారీ.. అంటే బడ్జెట్ పరంగా అని కాదు. నిడివి పరంగా. ఈ మూడు సినిమాల్లో అతి పెద్ద సినిమా.. లై. ఆ చిత్ర నిడివి ఏకంగా 2 గంటల 40 నిమిషాలుండటం విశేషం. యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ లాగా కనిపిస్తున్న లై ఈ ట్రెండుకు తగ్గట్లుగా రెండుంబావు గంటలకు అటు ఇటుగా ఉంటుందనుకుంటే.. ఏకంగా అంత నిడివి సెట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమాలో ద్వితీయార్ధం పెద్దగా ఉంటుందని అంటున్నారు.

ఇక నిడివి పరంగా రెండో పెద్ద సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నిడివి 2 గంటల 33 నిమిషాలు. రాజకీయ నేపథ్యంలో సినిమా అనగానే కొంచెం నిడివి ఎక్కువుంటుందనే అంచనా వేశారు. అందుకు తగ్గట్లే తయారైందీ సినిమా. ఇక మూడో సినిమా జయ జానకి నాయక రన్ టైం 2 గంటల 29 నిమిషాలట. మిగతా రెంటితో పోలిస్తే ఇది కొంచెం చిన్న సినిమాలా అనిపించొచ్చు కానీ.. గత కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండు ప్రకారం చూస్తే ఈ లెంగ్త్ కూడా ఎక్కువే. నాలుగైదేళ్లుగా తెలుగు సినిమాల నిడివి రెండుంబావు గంటలకు అటు ఇటుగా ఉంటోంది. నిడివి ఎక్కువైతే జనాలకు లాగ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుండటంతో మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఎడిటింగ్ టైంలో కోతలు వేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,