Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 10:56:23
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగాడు అల్లరి నరేష్. కానీ నాలుగేళ్లుగా అతడి పరిస్థితి ఏమంత బాగా లేదు. సుడిగాడు తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమైన అల్లరోడు.. హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. ప్రతి సినిమా మీదా చాలా ఆశలతో ఉంటున్నాడు కానీ.. అవి అతడికి నిరాశనే మిగులుస్తున్నాయి. గత ఏడాది సెల్ఫీ రాజా - ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలు అల్లరోడికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దీనికి తోడు అల్లరోడికి టర్నింగ్ పాయింట్ అవుతుందనుకున్న ఒక సినిమా అనివార్య కారణాల వల్ల సెట్స్ మీదికే వెళ్లలేదు.

అలా ఎలా సినిమాతో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించాల్సింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒరు వడక్కన్ సెల్ఫీ అనే సినిమాను అనీష్.. అల్లరోడితో రీమేక్ చేయాలనుకున్నాడు. ఈ చిత్రానికి సీనియర్ నటుడు రచయిత కృష్ణభగవాన్ రచనా సహకారం అందించడానికి కూడా ముందుకొచ్చాడు. ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వచ్చి ఆరు నెలలు దాటుతోంది. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు. ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రజీతే తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. జాహ్నవి ఫిలిమ్స్ బేనర్లో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో అవసరాల శ్రీనివాస్ ఓ కీలక పాత్ర చేయనున్నాడట.

,  ,  ,  ,  ,