Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2017 13:26:31
facebook Twitter Googleplus
Photo

బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా సినిమా సినిమాకి తన గ్లామర్ ని మార్చుకుంటోంది. వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ కోసం తన ఆకృతిని మార్చుకుంటోంది. ఎలా కనిపించినా ఏ మాత్రం నిరాశపరచకుండా అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది.

మొన్నటి వరకు ఓ మీడియం హీరోలతో నటించిన రాశి మొదటి సారి ఎన్టీఆర్ లాంటి స్టార్ తో నటించింది. రీసెంట్ గా విడుదలైన జై లవకుశ పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. ముఖ్యంగా రాశి సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించిందని టాక్ వినిపిస్తోంది. నివేదా థామస్ కి బాగానే పోటీని ఇచ్చిందని కూడా అంటున్నారు. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం లండన్ లో ఉంది. అందుకే అక్కడ అమ్మడు ఎన్టీఆర్ అభిమానులతో కలిసి జై లవకుశ సినిమాను చూసింది. అంతే కాకుండా వారితో పోటోలను దిగి వారితో కాసేపు ముచ్చటించిందట. అలాగే అభిమానులు కూడా రాశితో కేక్ కట్ చేయించి.. ఆమెను థ్రిల్ కు గురిచేశారు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి ప్రేమ అనే కొత్త సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ లో భాగంగా లండన్ వెళ్లి అక్కడే సినిమాను చూసింది. సినిమాకి భారీ ఆదరణ లభిస్తుండడంతో రాశి చాలా ఆనందంగా ఉంది.

,  ,  ,  ,  ,