Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 10:40:24
facebook Twitter Googleplus
Photo

హిట్టా ఫ్లాపా అన్నది సంబంధం లేదు. తెలుగులో మాంచి మసాలా సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే చాలు.. వ్యూస్ మోతెక్కిపోవాల్సింది. ఈ ట్రెండు ఎప్పుడు మొదలైందో.. ఎలా మొదలైందో కానీ.. ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజయ్యే హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలన్నీ ఇరగాడేస్తున్నాయి. లేటెస్టుగా నితిన్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ?హార్ట్ అటాక్? మూవీని హిందీలోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తే కేవలం 48 గంటల వ్యవధిలో 30 లక్షల వ్యూస్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో అత్యంత వేగంగా 3 మిలియన్ మార్కును అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ?హార్ట్ అటాక్?.

?హార్ట్ అటాక్? కంటే ముందు చాలా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి ఊహించని స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి. తెలుగులో యావరేజ్ గా ఆడిన అల్లు అర్జున్ మూవీ ?సన్నాఫ్ సత్యమూర్తి? యూట్యూబ్ లో కోటిన్నరకు పైగా వ్యూస్ తెచ్చుకుని దూసుకెళ్తుండటం విశేషం. ?రెబల్ లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా 20 లక్షలకు పైగా హిట్స్ తెచ్చుకుంది. ప్రభాస్ మరో ఫ్లాప్ మూవీ ?బుజ్జిగాడు? 40 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇంకా చాలా తెలుగు సినిమాలు హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్లో పెట్టేస్తుండగా.. వాటికి మాంచి వ్యూస్ వస్తున్నాయి. మరోవైపు కొన్ని హిందీ ఛానెళ్లలోనూ తెలుగు డబ్బింగ్ సినిమాల హవా సాగుతోంది. ప్రతి రోజూ తెలుగు డబ్బింగ్ సినిమాలు రన్ అవుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,