Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:16:17
facebook Twitter Googleplus
Photo

తమన్నా పేరెత్తగానే పాలరాతి శిల్పం లాంటి రూపం కళ్లముందు కదలాడుతుంది. అసలు మేకప్పే లేకున్నా మెరిసిపోయే రూపం ఆమెది. అంత తెల్లగా ఉంటుంది తమ్మూ. ఆ స్కిన్ టోన్ కారణంగా ఆమె కొన్ని రకాల పాత్రలకు సూటవ్వదు. మోడర్న్ పాత్రలకు మేడ్ ఫర్ లాగా కనిపించే తమ్మూ.. కొంచెం పేద అమ్మాయి పాత్ర చేయాలంటే కష్టమే.

కానీ తమిళ దర్శకుడు విజయ్ చందర్ మాత్రం తమ్మూతో ఏకంగా స్లమ్ గర్ల్ గా చూపించేద్దామనుకుంటున్నాడు. ఇంతకుముందు శింబు హీరోగా వాలు అనే సినిమా తీసిన విజయ్ చందర్.. విక్రమ్ హీరోగా ఒక సినిమా తీయడానికి రంగం సిద్ధం చేశాడు. ఇందులో తమన్నానే కథానాయిక. ఈ చిత్రంలో హీరోయిన్ మురికివాడకు చెందిన అమ్మాయట. తన పాత్ర గురించి.. కథ గురించి తెలుసుకున్న తమన్నా.. కన్నీల్లు పెట్టేసుకుందట. ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నట్లు తమ్మూ చెప్పింది.

విక్రమ్-తమ్మూ సినిమాకు స్కెచ్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇదొక థ్రిల్లర్ మూవీ అట. విక్రమ్ స్కెచ్ వేసి శత్రువుల్ని తుదముట్టిస్తాడు కాబట్టి ఈ సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారట. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం చేస్తున్న విక్రమ్ అది పూర్తయ్యాక స్కెచ్ చేస్తాడు.

,  ,  ,  ,  ,