Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 11:34:25
facebook Twitter Googleplus
Photo

కుర్రబ్యూటీ హెబ్బా పటేల్.. తాను ట్యాలెంటెడ్ మాత్రమే కాదు.. క్రౌడ్ పుల్లర్ అని కూడా ప్రూవ్ చేసేసుకుంది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ చిత్రానికి కేవలం హెబ్బా బొమ్మ చూసే థియేటర్లకు వచ్చారు జనాలు. ఇప్పుడీ భామ ఏంజెల్ అనే మూవీలో నటిస్తుండగా.. ఇందులో వినవయ్యా రామయ్యా ఫేమ్ నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ప్రచార పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. సోషియా ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న మూవీలో.. హెబ్బా అందాలను బాగానే పెట్టుబడి పెట్టేశారు టీం. హీరో బైక్ తోలుతుంటే.. ఎదురుగా రివర్స్ లో కూర్చోవడం నుంచి.. హెబ్బా స్పీడ్ ను బాగానే ఉపయోగించుకున్నారు. ఇక స్విమ్మింగ్ పూల్ లో అందాలను చూపించే సీన్స్ ను పిక్చరైజ్ చేయడమే కాదు.. వాటిని కూడా ప్రచారం కోసం ఉపయోగించుకోవడం విశేషం.

ఈ మూవీకి సెల్లింగ్ పాయంట్ తానే అని అర్ధం చేసుకున్న హెబ్బా పటేల్.. తన సైడ్ నుంచి కూడా ఫుల్లు సపోర్ట్ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఏంజెల్ మూవీలో గ్రాఫిక్స్ బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుందట.

,  ,  ,  ,  ,  ,