Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Apr-2017 13:50:45
facebook Twitter Googleplus
Photo

కుమారి 21 ఎఫ్ బామ హెబ్బా పటేల్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మరింత బోల్డ్ గా మాట్లాడింది. తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేశానని ఆమె వెల్లడించింది. అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని కూడా చెప్పింది. అతడి వల్లే తాను ఎదిగానని.. తనతో తన బంధం గురించి తన కుటుంబానికి కూడా తెలుసని ఆమె చెప్పింది. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం నిలవలేదని చెప్పింది. మరోవైపు రాజ్ తరుణ్ తో ఎఫైర్ అని జరిగిన ప్రచారం గురించి కూడా ఆమె స్పందించింది.

‘‘నాకు.. రాజ్ తరుణ్ కు ఏదో ఉన్నట్లుగా ప్రచారం చేశారు. ‘ఈడోరకం ఆడోరకం’ గుమ్మడికాయ వేడుకలో నేను తనతో ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో మా మధ్య బ్రేకప్ అయిందన్నారు. అలా వాక్ చేయకపోవడంలో ప్రత్యేక కారణం ఏదీ లేదు. నేనపుడు డైరెక్టర్ రవిబాబు గారితో మాట్లాడుతూ బిజీగా ఉన్నా. అందుకే తరుణ్ తో కలిసి ర్యాంప్ వాక్ చేయలేదు. బేసిగ్గా కూడా నాకది ఇష్టం ఉండదు. ఐతే రాజ్ తరుణ్ తో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి రెడీ అవగానే మా మధ్య ప్యాచప్ అయిపోయిందని రాశారు. మాది హిట్ కాంబినేషన్ కావడంతో దర్శక నిర్మాతలు మళ్లీ మళ్లీ మా జంటతో సినిమాలు తీస్తున్నారు. అంతే. మా మధ్య ఏం లేదు. అతను నాకు మంచి ఫ్రెండ్. నేను వ్యక్తిగత జీవితంలో సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తితో డేటింగ్ చేశాను. ఆ బంధం కొంత కాలమే సాగింది. అతను మా కుటుంబానికి కూడా తెలుసు. మా బంధాన్ని వాళ్లు అర్థం చేసుకున్నారు. అతను నాకెంతో చేశాడు. తన వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం సాగలేదు. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితి లేదు. ఆలోపు డబ్బు సంపాదించాలి. నేను మహారాష్ట్ర అమ్మాయిని కాబట్టి నా కుటుంబానికి ముంబయిలో ఇల్లు తీసివ్వాలని అనుకున్నా. కానీ అది అంత సులభం కాదు

,  ,  ,  ,