Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 13:16:45
facebook Twitter Googleplus
Photo

తెలుగులో సుకుమార్ తీసిన సినిమా 100% లవ్ సినిమా చాలమందికి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. అందులో పాలనురగల అందం చందం ఉన్న తమన్నా చేసిన అద్భుత నటనకు యూత్ మొత్తం ఫిధా అయ్యారు. ఈ సినిమాలో మహాలక్ష్మి పాత్ర ఆదారంగా సినిమా ముందుకు సాగటం జరుగుతుంది. హీరో గా నాగ చైతన్య నటనలో కొత్తదనం తమన్నా బ్యూటిఫుల్ యాక్ట్ కలిసి ఈ సినిమాను హిట్ ట్రాక్ పైకి నడిపించింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో నిర్మిస్తున్నారు.

తమిళ రీమేక్ లో కూడా తమన్నా అయితే బెటర్ అనుకుని.. తరువాత రూటు మార్చారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో కన్ఫామ్ అయిన వేళ.. ఇప్పుడు మరో షాకర్ వింటున్నారు. ఇప్పుడు ఈ ఆఫర్ ను కుమారి 21 f ఫేమ్ హెబ్బ పాటేల్ చేతిలో పెట్టాడట డైరెక్టర్ చంద్రమౌళి. హెబ్బా పాటేల్ ఈ ఆఫర్ రాంగానే క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టేసిందని తెలుస్తోంది. తమిళంలో పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ రావడం హెబ్బ కు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోగా జివి ప్రకాష్ కుమార్ నటిస్తున్నారు. తమిళ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూ నే ఇప్పుడు హీరోగా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడనీ కుర్రాడు.

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మాసంలో మొదలుకావచ్చు అని చెబుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ చంద్రమౌళి సుకుమార్ తో చాల ఏళ్లుగా కలిసి పని చేశారు. ఇప్పుడు తమిళంలో మనోడు 100% లవ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ తరువాత కుమారి 21 f కూడా తీస్తాడట.

,  ,  ,  ,  ,