Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:04:08
facebook Twitter Googleplus
Photo

నటి జ్యోతిక ముగ్గురు పూర్వనాయికలతో నటించడానికి సిద్ధం అయ్యారు. జ్యోతిక గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకిగా టాప్ పొజిషన్‌లో ఉండగానే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడి నటనకు దూరం అయ్యారు. ఆనక ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు. తన స్థాయికి తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయించుకున్న జ్యోతిక 2014లో 36 వయదినిలే చిత్రం ద్వారా రీఎంట్రీ అయ్యారు. స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా అంగీకరించని ఆమె తదుపరి చిత్రం కోసం 50 కథలకుపైగా విన్నారని సమాచారం. వాటిలో కుట్రం కడిదల్ చిత్ర దర్శకుడు బ్రహ్మ చెప్పిన కథ బాగా ఇంప్రెస్ చేయడంతో అందులో నటించడానికి పచ్చజెండా ఊపారు. తన భర్త సూర్య 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం నిరాడంబరంగా ప్రారంభమైంది.

ట్విట్టర్‌లో సూర్య ట్రీట్
ఈ విషయాన్ని నటుడు సూర్య తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గంతో జ్యోతిక తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటిలానే మీ ఆదరాభిమానాలు అందించాలని కోరుకుంటూ ఉత్సాహవంతమైన భర్త అని పేర్కొన్నారు. ఇందులో జ్యోతికతో పాటు పూర్వపు ప్రముఖ నాయికలు భానుప్రియ,ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్ నటించడం విశేషం. ముఖ్యంగా నటి భానుప్రియ చాలా గ్యాప్ తరువాత తమిళంలో నటిస్తున్న చిత్రం ఇది.

నాజర్, లివింగ్‌స్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిక అమ్మగా గ్రామీణ పాత్రలో నటిస్తున్నారు. నటుడు సూర్య కూడా అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,