Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 11:39:33
facebook Twitter Googleplus
Photo

కుమారి 21ఎఫ్ మూవీతో సెక్సీ బ్యూటి హేభా పటేల్ చాలామంది కుర్రకారుకే హార్ట్ ఎటాక్ తెప్పించేసింది. ఆమె మొదటి సినిమా అది కాకపోయినా.. ఆడియన్స్ కు బాగా దగ్గరైంది మాత్రం కుమారితోనే. తన లేటెస్ట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడాతో రేపు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్స్ లో భాగంగా బోలెడన్ని కబుర్లు చెప్పేస్తోంది.

తెలుగు-తమిళ్-కన్నడ భాషల్లో ఒకే ఏడాది అరంగేట్రం చేసిన అరుదైన రికార్డ్ హేభా పేరుపై ఉంది. 'మొదట తమిళ మూవీ "తిరుమానం ఎనుం నిఖా"యాక్సెప్ట్ చేశా. అది ఆలస్యం అయింది. ఆ తర్వాత తెలుగులో "అలా ఎలా"మూవీ మొదలుపెట్టాను. అది కూడా విడుదల లేట్ అయింది. కన్నడ మూవీ "అధ్యక్ష" మాత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయిపోయింది. మూడు సినిమాలు నెలల వ్యవధిలోనే రిలీజ్ కావడం అనుకోకుండా జరిగింది' అని చెప్పింది హేభా పటేల్.

'నేను మొదట నటించిన తమిళ్ మూవీ ఆడకపోవడంతో డిజప్పాయింట్ అయ్యాను. కన్నడ మూవీ అంచనాలకు మించి ఆడేసింది. ఆ తర్వాత తెలుగు మూవీ వచ్చినా.. అప్పటికే హిట్టు ఫ్లాపు రుచి చూడ్డంతో నిలకడగా ఉండాలని ఫిక్స్ అయ్యా. అయితే ఆ సినిమా బాగా ఆడ్డంతో తెలుగులో కూడా మంచి లాంఛింగ్ లభించింది' అంటోంది హేభ. తాను పుట్టినది బాంబేలో అయినా.. భాషల విషయంలో పెద్దగా బేధాలు లేవని.. ఎక్కువగా సౌత్ ప్రాజెక్టుల్లోనే.. అందులోనూ తెలుగులో మరిన్ని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పిన ఈ కుమారి.. అందుకు కారణం కూడా చెప్పింది.

బాలీవుడ్ లో కంటే.. తెలుగులోనే ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందట. పైగా వరుస సినిమాలు చేస్తుండడంతో తెలుగు అర్ధం అయిపోతోందట కూడా. అన్నిటికంటే ముఖ్యంగా.. తెలుగు ఆడియన్స్ తనను ఆదరించిన తీరు చూసి.. టాలీవుడ్ ప్రేక్షకులు తెగ నచ్చేశారని అంటోంది హేభా పటేల్

,  ,  ,  ,  ,