Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 15:27:54
facebook Twitter Googleplus
Photo

వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెర మీదే కాదు.. బయట కూడా అతనెక్కడుంటే అక్కడ నవ్వులే. నిఖిల్ హీరోగా నటించిన ?ఎక్కడికి పోతావు చిన్నవాడా?లో కీలక పాత్ర పోషించిన కిషోర్.. ఈ సినిమా ఆడియో వేడుకలోనూ తనదైన శైలిలో పంచ్ లు పేలుస్తూ తెగ నవ్వించాడు. ?ఎక్కడికి..? సినిమా షూటింగ్ సందర్భంగా తాను పడ్డ పాట్ల గురించి అతను సరదా విశేషాలు వెల్లడించాడు.

??నిఖిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అంటే.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.. టైపులో కాదు. మామూలుగానే. కొందరు బుద్ధిజంను నమ్ముతారు. ఇంకొందరు పవనిజంను నమ్ముతారు. నిఖిల్ మాత్రం మెటబాలిజంను నమ్ముతాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. కేఎఫ్సీ నుంచి అదీ ఇదీ తెచ్చుకుని తింటుంటాడు. అందుకే అంత ఎనర్జీ ఉంటుంది. ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? షూటింగ్ కోసం ఒక గుహలోకి వెళ్లాం. అది లోపలికి మూడు కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. తెల్లవారుజామున్న ఎప్పుడో ఐదున్నరకి లోపలికి పంపిస్తే.. 8 గంటలకు బయటికొచ్చాం. లోపల ఆక్సిజన్ సరిగా లేదు. పైగా పొగ వదిలారు. ఒక కిలోమీటరు నడవగానే నా పనైపోయింది. నిఖిల్ మాత్రం భలే ఎగ్జైటింగా ఉంది కద భయ్యా అంటూ ఎగురుతున్నాడు. నాకు మాత్రం పులుసు కారిపోయింది. నీకో దండం అనేశాను?? అంటూ అందరిలో నవ్వులు పూయించాడు వెన్నెల కిషోర్.

,  ,  ,  ,  ,  ,  ,