Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 14:09:09
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లు ఎందుకు దొరకరు అని అందరూ అంటున్న అది మెగా స్టార్ విషయంకు మాత్రం వర్తించదు. ఎందుకంటే అతను మెగా స్టార్ కాబట్టి అతని సినిమా విడుదలైతే అది అభిమానులుకు పండుగ రోజులాగా మారుతుంది కాబట్టి. చిరంజీవి హీరోగా వస్తున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ అయ్యిందిలే అనుకుంటే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టు కు మరో కొత్త సమస్య వచ్చింది. ఈ సినిమాలో ఇప్పుడు చిరంజీవి పక్కన ఎవరు నటించబోతున్నారు ఎవరైతే బాగుంటుంది అని కొణిదెల ఫ్యామిలి అంతా తర్జన భర్జన పడుతోంది.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావలిసి ఉంది. అందులో ఇద్దరు కోసం సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ను అలాగే బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్యా రాయ్ ను అడిగినట్లు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా చేస్తారా లేదా అనేది కచ్చితంగా తెలియదు. ఇద్దరు హీరోయిన్లూ బాగా పేరున్న హీరోయిన్లు కాబట్టి వాళ్ళ పారితోషకం కూడా భారీగానే అడుగుతున్నారట. ఇక్కడే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి టీమ్ కి హీరోయిన్లు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యా రాయ్ అయితే ఏకంగా 9 కోట్లు అడుగుతుంది అని టాక్. అలాగే నయన్ కూడా 5 కి తక్కువైతే చేయనందట. అందుకే ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో రామ్ చరణ్ అండ్ టీమ్ కు అర్ధంకావట్లేదు అంటున్నారు.

ఈ హిస్టారికల్ డ్రామా ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బేనర్ పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సహ నిర్మాత గా లైకా ప్రొడక్షన్ ఉండబోతుంది. ఈ సినిమా ను తమిళ్ హిందీ లో కూడా విడుదలచేయబోతున్నారు.

,  ,  ,  ,