Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 11:53:34
facebook Twitter Googleplus
Photo

గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమా రేంజే మారిపోయింది. బాలీవుడ్లోళ్లను మించిపోయి భారీ సినిమాలు తీసేస్తున్నారు దక్షిణాది ఫిలిం మేకర్స్. మగధీర.. ఈగ.. బాహుబలి.. కంచె.. రోబో లాంటి సినిమాలు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. ఈ కోవలోకి చేరేలా కనిపిస్తోంది ?కాష్మోరా?. ట్రైలర్ చూస్తే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ శుక్రవారమే ?కాష్మోరా? ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు.

! కాష్మోరా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు. కార్తి కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే.

! కాష్మోరా సినిమా బడ్జెట్లో దాదాపు రూ.15 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేశారు. దాదాపు 1800 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉండబోతున్నాయి.

! ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ 19 భారీ సెట్లు తీర్చిదిద్దాడు. వాటిలో రాజదర్బార్ సెట్ కళ్లు చెదిరేలా ఉంటుంందంటున్నారు.

! కార్తి ఈ సినిమాలో మూడు గెటప్పుల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి కాష్మోరా.. ఇంకోటి రాజ్ నాయక్. మూడో పాత్ర సస్పెన్స్ అంటున్నారు. రాజ్ నాయక్ పాత్ర కోసం త్రీడీ ఫేస్ స్కాన్ అనే టెక్నాలజీని ఉపయోగించారు.

! ఈ చిత్రంలో దాదాపు 90 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకోసం 25 గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీలు రెండు నెలల పాటు పని చేశాయి.

! ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో కాష్మోరా రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట ఈ సినిమాకు 450 స్క్రీన్లే ఇచ్చారు.

,  ,  ,  ,  ,