Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2015 11:42:49
facebook Twitter Googleplus
Photo

గతంలో తమ పెళ్లికి ముందు 'కాక కాక', 'మాయావి', 'సిల్లును ఒరు కాదల్'... వంటి తమిళ సినిమాలలో జంటగా నటించిన సూర్య, జ్యోతిక జంట మళ్లీ చాలా కాలం తర్వాత వెండితెరకు రానుంది. ఇటీవలే '36 వయధినిలే' చిత్రంతో మళ్లీ ముఖానికి రంగేసుకున్న జ్యోతిక, ఆ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి, నటన కంటిన్యూ చేయాలని నిశ్చయించుకుందట. భర్త సూర్య కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు. దీంతో తామిద్దరం కలిసి మళ్లీ జంటగా అభిమానులను అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరు ఇటీవల కొందరు దర్శకులు చెప్పిన కథలు విన్నారు. వీటిలో రెండు మూడు సబ్జెక్టులు వీరికి బాగా నచ్చాయట. త్వరలో వీటి నుంచి ఒకటి ఎంచుకుని ప్రొసీడ్ అవుతారని కోలీవుడ్ న్యూస్!

,  ,  ,  ,