Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 11:42:23
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ?ఓకే బంగారం? సినిమా గతేడాది విడుదలై తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్ ? నిత్యా మీనన్‌ల జోడీకి కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో దుల్కర్-నిత్యా జంటగా నటించిన మళయాల సినిమాలు కొన్ని తెలుగు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ?ఉస్తాద్ హోటల్? అనే సినిమా ?జతగా? అంటూ, ?100 డేస్ ఆఫ్ లవ్? అనే సినిమా అదే పేరుతో తెలుగులో వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.
అయితే తెలుగులో ఇతర పెద్ద సినిమాలు విడుదలవుతూ వస్తూండడంతో కొద్దికాలంగా ఈ రెండు సినిమాలకూ సరైన విడుదల తేదీ దొరకలేదు. తాజాగా ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాల హడావుడి కాస్త తగ్గడంతో ?జతగా?, ?100 డేస్ ఆఫ్ లవ్? విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ?100 డేస్ ఆఫ్ లవ్? సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక జూలై 13న హైద్రాబాద్‌లో జరగనుంది. ఇక సినిమా కూడా త్వరలోనే విడుదలవుతుందని నిత్యా మీనన్ తెలిపారు. మరి ?ఓకే బంగారం?తో ఆకట్టుకున్న ఈ జోడీ ఈ సినిమాలతోనూ మెప్పిస్తుందా? వేచి చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,