Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 12:51:20
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు ఎన్నో అనుకుంటాడు. కానీ సినిమా సెట్స్ పైకి వచ్చే సరికి ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి కూడా అలానే ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ - మిరపకాయ్ సినిమాలతో తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకున్న హరీష్ దువ్వడా జగన్నాథమ్ సినిమాతో పర్వాలేదు అనిపించాడు.

అయితే ఆయన లేటెస్ట్ గా రాసుకున్న డ్యూయల్ లవ్ స్టొరీ మొదట దాగుడుమూతలు మెగా హీరోలతో తీద్దామనుకున్నాడు. కానీ అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. అంతే కాకుండా మరో ఇద్దరి యువ హీరోలకు కూడా కథ చెప్పాడు అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో పూర్తిగా కొత్త వారితో మొదటి సారి ఒక సినిమాని చేయబోతున్నాడాట హరీష్ శంకర్. ఈ సినిమా పూర్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట.

ఇప్పటివరకు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమాలకు కాస్త భిన్నంగా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను మొదట నిర్మాత దిల్ రాజు తెరకెక్కించనున్నారు అని టాక్ వినిపించింది. కానీ హరీష్ శంకర్ ఈ సినిమా ద్వారా తన ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారట.

,  ,  ,  ,