Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2015 14:07:04
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ నటించనున్నాడా? ఇప్పుడు చెన్నయ్ సినీ వర్గాలలో ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'రోబో' సీక్వెల్ చేసే పనిలో బిజీగా వున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో రజనీకాంత్ హీరోగా నటించనున్నాడు. దీని స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మాత్రం శంకర్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రంలో అర్నాల్డ్ కూడా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమధ్య శంకర్ తీసిన 'ఐ' సినిమా ఆడియో వేడుకకు అర్నాల్డ్ చెన్నయ్ వచ్చాడు. అప్పుడే తనకు శంకర్ దర్శకత్వంలో నటించాలనుందన్న కోరికను ఆయన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచీ వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో 'రోబో 2'లో ఆయనకు తగ్గా ఒక పాత్రను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అర్నాల్డ్ ఇందులో నటించడం అంటూ జరిగితే కనుక, ఈ ప్రాజక్టుకు అంతర్జాతీయంగా క్రేజ్ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు!

,  ,  ,