Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 13:39:07
facebook Twitter Googleplus
Photo

తమిళ డబ్బింగ్ సినిమాలంటే మనోళ్లకు బాగా ఆసక్తి. అప్పుడప్పుడూ వేరే భాషల నుంచి కూడా సినిమాలు వస్తుంటాయి కానీ.. వాటిని పట్టించుకోవడం తక్కువ. ఐతే హిందీ నుంచి ఒక హీరో క్రమం తప్పకుండా తన సినిమాల్ని తెలుగులోకి అందిస్తుంటాడు. ఆ హీరోనే హృతిక్ రోషన్. క్రిష్ దగ్గర్నుంచి హృతిక్ సినిమాలు తరచుగా తెలుగులోకి వస్తుంటాయి. ధూమ్-2.. క్రిష్-3 సినిమాలు తెలుగులో మంచి ఆదరణ సంపాదించాయి. ఈ మధ్య ?మొహెంజదారో?ను కూడా తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో జనాలకు పట్టలేదు. ఇప్పుడు హృతిక్ కొత్త సినిమాను కూడా తెలుగులోకి రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమానే.. కాబిల్.

హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. తన సొంత బేనర్లో హృతిక్ హీరోగా తెరకెక్కే సినిమాలకు తనే దర్శకత్వం వహిస్తుంటాడు రాకేష్. ఈసారి బయటి దర్శకుడితో అతను సినిమాను నిర్మిస్తున్నాడు. జంగ్.. కాంటే.. జిందా లాంటి సినిమాలు రూపొందించిన సంజయ్ గుప్తా ?కాబిల్?కు దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ?గౌరవం?.. ?కొరియర్ బాయ్ కళ్యాణ్? లాంటి సినిమాలతో తెలుగులో చేదు అనుభవాలు ఎదుర్కొన్న యామి గౌతమ్ ఈ చిత్రంలో హృతిక్ కు జోడీగా నటిస్తుండటం విశేషం. నవంబరు 26న హిందీతో పాటు తెలుగులోనూ ?కాబిల్? ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ?మొహెంజదారో? కోసం పడ్డ కష్టమంతా వృథా కావడంతో హృతిక్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతడికి ?కాబలి? సక్సెస్ అందిస్తుందేమో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,