Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jan-2016 14:40:52
facebook Twitter Googleplus
Photo

మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటే బాగోదని వెనక్కి తగ్గే రోజులు పోయాయి. ఈ రోజుల్లో ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. ఎంతో కొంత హడావుడి చేయాలి. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. నవీన్ చంద్ర ఈ ప్రయత్నంలోనే ఉన్నట్లున్నాడు. బళ్లారిలో ?లచ్చిందేవికి ఓ లెక్కుంది? విడుదల సందర్భంగా అక్కడ కనిపిస్తున్న భారీ కటౌటే దీనికి నిదర్శనం. పెద్ద హీరోలకే కటౌట్లు పెట్టే సంస్కృతి తగ్గిపోతున్న ఈ రోజుల్లో స్టార్ ఇమేజ్ ఏమీ లేని నవీన్ చంద్రకు అక్కడ భారీ కటౌట్ పెట్టి ఓ రేంజిలో హంగామా చేస్తున్నారు. కటౌట్ పెట్టడమే కాదు.. దానికి భారీగా పూల మాలలు వేసి లైటింగ్ అదీ పెట్టి బాగానే సందడి చేస్తున్నారు.

నవీన్ చంద్ర బళ్లారి వాడు కావడమే ఈ సందడికి కారణం. ఎంత తమ ఊరివాడైనా కూడా ఈ రేంజిలో హంగామా చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే నవీన్ చంద్ర ఫాలోయింగ్ సంగతి పక్కనబెడితే అతను మంచి నటుడిగా అయితే గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సినిమా ?అందాల రాక్షసి?తోనే మంచి పేరు సంపాదించిన నవీన్ చంద్ర.. సరైన బ్రేక్ అందుకోకున్నా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఐతే ?లచ్చిందేవికి ఓ లెక్కుంది? అతను కోరుకున్న బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల రూపొందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. 1.45 గంటల షార్ట్ లెంగ్త్ తో ఆసక్తికరంగా ఈ క్రైమ్ కామెడీ మూవీని రూపొందించాడట జగదీష్. మరి ఈ మూవీ నవీన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

,