Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 11:32:53
facebook Twitter Googleplus
Photo

దసరా సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడాయి. జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ బాబు సినిమాలు ఒకేసారి రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళగా కనిపించాయి. మళ్లీ అలాంటి సందడి కనిపించలేదు. రాజు గారి గది-2.. రాజా ది గ్రేట్.. జవాన్ లాంటి మీడియం రేంజి సినిమాలు వచ్చినా.. వాటి హడావుడి ఒక్క రోజుకే పరిమితం అయింది. ఆ తర్వాత హౌస్ ఫుల్స్ లేవు.. పెద్ద హంగామా లేదు. నవంబరులో సినిమాల పరిస్థితైతే చెప్పాల్సిన పని లేదు.

డిసెంబర్లో కూడా పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. క్రిస్మస్ వీకెండ్ లో ఎంసీఏ.. హలో లాంటి క్రేజీ సినిమాలు వస్తున్నప్పటికీ వాటికి మరీ హంగామా అయితే ఉండదు. పెద్ద స్టార్లు వస్తే కనిపించే హడావుడే వేరు. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టంతా తర్వాతి బిగ్ మూవీ అజ్నాతవాసి మీదే ఉంది. ఈ సినిమాకు విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. దీంతో వన్ మంత్ ఫర్ అజ్నాతవాసి అంటూ పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హంగామా మొదలుపెట్టేశారు.

పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన సినిమాలకు క్రేజ్ తీసుకురాగల సత్తా పవన్ సొంతం. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయినా.. కాటమరాయుడు కు హైప్ తక్కువేమీ లేదు. ఆ సినిమా ఆడకపోయినా ఇప్పుడు అజ్నాతవాసి కి బంపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు అజ్నాతవాసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.

పవన్ సినిమా వచ్చిందంటే అడ్వాన్స్ బుకింగ్స్ మోత మామూలుగా ఉండదు. నాలుగైదు రోజుల ముందే హంగామా మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో సినిమాను నింపేయొచ్చు. వీకెండ్ మొత్తం ముందే టికెట్లు బుక్కయిపోతాయి. థియేటర్ల యజమానుల దగ్గర్నుంచి క్యాంటీన్.. వెహికల్ స్టాండ్ నడిపేవాడి వరకూ అందరూ ఫుల్ ఖుషీ అయిపోతారు. అందులోనూ పవన్-త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. పైగా సంక్రాంతి సీజన్లో రిలీజైతే హంగామా ఎలా ఉంటో చెప్పేదేముంది..? అందుకే ఈ సినిమా కోసం అందరూ చాలా ఆశగా.. ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

,  ,  ,  ,  ,