Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2016 11:04:15
facebook Twitter Googleplus
Photo

ప్లాన్ చేసిన డేట్ కి 15 రోజుల ముందే.. ఓ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఫైనల్ కాపీ చేతిలో పెట్టుకుంటే.. ఎంత పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చో ప్రూవ్ చేస్తున్నారు హైపర్ టీం. సెప్టెంబర్ 30వ తారీఖు రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీకి.. జస్ట్ వారం ముందు మాత్రమే ట్రైలర్ ఇచ్చారు. అప్పటికే ఆడియో రిలీజ్ ని వివిధ ఛానల్స్ లో వెరైటీగా పూర్తి చేశారు. ఈ డిఫరెంట్ ప్రమోషన్స్ ఎఫెక్ట్ తో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ ని స్మూత్ గా ఫినిష్ చేసేసింది హైపర్ యూనిట్.

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రదర్శించే ఎనర్జీనే హైపర్ కు కీలకం అని ట్రైలర్ లోనే అర్ధమైపోయింది. 'రెడ్ బుల్ తాగిన బుల్ లా ఉన్నాడు' అంటూ ట్రైలర్ లోని డైలాగ్ తో ఈ విషయాన్ని డైరెక్టుగానే చెప్పేసింది యూనిట్. ఇప్పుడు సెన్సార్ నుంచి కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ రామ్ ఎనర్జీ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుందట. ఒక్క సీన్ కి కూడా కత్తెర వేయకుండా.. కేవలం కొన్ని చోట్ల మ్యూట్ చేయాలని చెప్పి.. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేసిందట సెన్సార్ బోర్డ్. పైగా రాశి ఖన్ఆన ఆరబోసిన గ్లామర్ దాటిని చూశాక.. ఆ మాత్రం ఎడల్ట్ టచ్ ఇవ్వకపోతే కష్టంలే అనుకున్నారేమో.

హైపర్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందనే విషయం ఈ టాక్ తో అర్ధమైపోతోంది. రామ్ కూడా ఈ మూవీ సక్సెస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. దసరా సీజన్ స్టార్టింగ్ లోనే రిలీజ్ అవుతుండడంతో.. టాక్ బాగుంటే భారీ వసూళ్లను సాధించి.. రామ్ ను మరో మెట్టు ఎక్కించే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,