Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:01:16
facebook Twitter Googleplus
Photo

నేను శైలజ సినిమాలో ఎలాగైతే నైట్ ఈజ్ సో లాంగ్ అనే పాటతో ఓపెనింగే అలరించాడో.. ఇప్పుడు కూడా తన హైపర్ సినిమా టైటిల్ సాంగులో అదే రేంజులో అలరించాలని డిసైడైనట్లున్నాడు రామ్. అందుకే ఒక ఎనర్జటిక్ గా ఉండే నెంబర్ ను ఎంచుకుని దానిని బాగా పిక్చరైజ్ చేయించి రిలీజ్ చేశాడు.

హైపర్ సినిమాలోని పాటలను రోజుకోటి చొప్పున విడుదల చేయాలని రామ్ ఫిక్సయ్యాడట. అందులో భాగంగా గురువారం సాయంత్రం మనోడు సినిమాలోని 'కమ్ బ్యాక్' సాంగును టివి5 ఛానెల్ లైవ్ లో విడుదల చేశాడు. అమ్మాయిలను టీజింగ్.. వాళ్ళని ప్రేమించమని అడగటం.. వగైరా రొటీన్ కాన్సెప్టుపైన సాగే సాంగ్ అయినప్పటికీ.. జిబ్రాన్ కాస్త సౌండింగ్ కొత్తగా ఇవ్వడం.. అలాగే పాటను కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేసిన తీరు బాగుండటంతో.. సాంగ్ ఇనస్టాంట్ గా నచ్చేసే ఛాన్సుంది.

కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాలో రామ్ అండ్ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. తండ్రి సెంటిమెంట్ గా సాగే కథ కాబట్టి.. తండ్రి పాత్రకు సత్యరాజ్ ను తీసుకున్నారు మరి.

,  ,  ,  ,  ,  ,  ,