Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 13:03:03
facebook Twitter Googleplus
Photo

ఇలియానా..ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన నటి..ఇప్పుడు ఊపలేక, ఒకవేళ ఊపుదాం అనుకున్న చూసేవారులేక విలవిలాడుతుంది. ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కుంటున్న ఈ భామకు తాజాగా ఓ మీడియా వారు తనపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీసారని తన ట్విట్టర్ లో పేర్కొంది..

ఇటీవల తనను ఓ ఇంటర్వ్యూ చేసిన మీడియా తాను చెప్పిన విధంగా కాకుండా తనకు తోచిన విధంగా తప్పుడు రాతలు రాసారని , అలాంటప్పుడు నన్ను ఇంటర్వ్యూ కు ఎందుకు పిలవడం , ఆ రాతలేవో మీరే రాసుకోవచ్చు కదా అంటూ మొత్తం మీడియా ఫై ఫైర్ అయ్యింది.

ఇంతకీ ఆ మీడియా వారు ఏం రాసారంటే..?తన ఫ్యామిలీ ఒత్తిడి మేరకే తాను నటించాల్సి వస్తోందని చెప్పినట్లు ఇంటర్వ్యూలో రాశారని.. ఐతే తాను ఎక్కడా ఆ మాట అనలేదని.. తన ఫ్యామిలీ అలాంటి పరిస్థితిలో లేదని.. తనకు పూర్తి స్వేచ్ఛనిస్తుందని.. మద్దతుగా ఉంటుందని ఇలియానా చెప్పుకొచ్చింది.

అంతే కాదు తన బాయ్ ఫ్రెండ్ విషయం లోను తాను చెప్పింది ఒకటయితే వారు ఇంకోలా రాసారని తెలిపింది. అంత బాగానే చెప్పింది కానీ ఆ ఇంటర్వ్యూ చేసిందో ఎవరో చెప్పకపోవడం గమనార్హం.

,  ,  ,  ,  ,